ఆటాడ‌బోతోన్న ఆది

0
234

విభిన్న పాత్రలలో నటిస్తూ త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో.. ఆది పినిశెట్టి. రామ్‌చ‌ర‌ణ్ అన్న‌గా రంగ‌స్థ‌లం సినిమాలో అద్భుత‌మైన న‌ట‌న‌తో మంచి మైలేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడీ యంగ్ హీరో అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే “క్లాప్” సినిమాలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఆకాంక్ష సింగ్ కథానాయిక.

రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లు పై ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఇవాళ (జూన్ 12)న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారధులు మధ్య ఘనంగా ప్రారంభమైంది.

ఈ నెల 17నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోన్న ఈ సినిమాలో నాజర్, ప్రకాష్ రాజ్, క్రిష కురుప్, బ్రహ్మాజీ, ముండాసు పట్టి రాందాసు, మిమే గోపి, సూర్య, మీనా, వాసు తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజా సంగీతం.