‘AA 19’ మ్యూజిక్ సిట్టింగ్ ..!

0
128
alluarjun thrivikram combination movie AA19

బన్నీ పుట్టిన రోజు ఈ మధ్యే జరిగింది. ఆ సందర్బంగా ఏకంగా మూడు సినిమాలకు ఓకే చెప్తూ.. ఫ్యాన్స్ కి శుభవార్తే చెప్పారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ’ సినిమా హిట్ సాధించకపోవడంతో చాలా రోజులు గ్యాప్ ఇచ్చాడు. సంవత్సరం పాటు ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పకుండా , ఏకంగా మూడు సినిమాలకు స్టైలీష్‌ స్టార్‌ సైన్ చేయడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు అభిమానులంతా. ఇక ఇప్పటి నుంచి వరుస సినిమాలతో బిజీ గా ఉండబోతున్నారు.

త్రివిక్రమ్ తో కలిసి మూడో సినిమను బన్నీ చేయబోతున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్‌, వేణు శ్రీరామ్‌ లతో కలిసి చేస్తాడట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయబోవు సినిమా ఈ నెల 24వ తేదీన సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఇంతలోనే ఈ సినిమాకు సంబందించిన  మ్యూజిక్‌ సిట్టింగ్‌ మొదలు పెట్టారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించగా , థమన్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. థమన్‌ తన ట్విట్టర్ లో ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్ లో త్రివిక్రమ్‌, సిరివెన్నెలతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేశారు. ఇక సినిమాలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం అందరిని అలరించింది. బన్నీ,పూజ, త్రివిక్రమ్ సినిమా తప్పకుండా మెప్పిస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.