రాజ‌కీయాల్లో రోజుకో కొత్త శ‌త్రువు : బండ్ల గ‌ణేష్

0
189

తాను రాజ‌కీయాల‌కు ప‌నికిరాన‌న్న విష‌యం తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌క ముందే తేలింద‌ని, కానీ అప్పుడే రాజకీయాల్లోకి వ‌చ్చి, అప్ప‌టిక‌ప్పుడే మ‌ళ్లీ వెన‌క్కి వ‌స్తే బాగుండ‌ద‌నే ఉద్దేశంతో మార్చి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగ‌డం జ‌రిగింద‌ని ఆ పార్టీ రాజీనామా చేసిన ప్ర‌ముఖ సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్ చెప్పారు. కాగా, బుధ‌వారం ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బండ్ల గ‌ణేష్ మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

రాజ‌కీయాలంటే న‌ట‌న కాద‌ని, వాస్త‌విక‌త‌తో కూడుకున్న‌వ‌న్న త‌న అభిప్రాయాన్ని బండ్ల గ‌ణేష్ తెలిపారు. త‌న‌కు ఇప్ప‌టికీ కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీని ప్ర‌ధానిగా, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఏపీ ముఖ్య‌మంత్రిగా చూడాల‌న్న ఆశ ఉంద‌ని, ఆ రెండూ నెర‌వేరుతాయ‌న్న ప్ర‌గాఢ న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఎప్ప‌ట్నుంచో ఉన్న కొంద‌రి నేత‌ల‌కంటే.. వారికి మించిన పేరు త‌న‌కొచ్చినా దానివ‌ల్ల త‌న‌కేమీ లాభం లేద‌న్నారు. కొత్త శ‌త్రువుల‌ను తెచ్చుకోవ‌డం ఇష్టంలేక‌నే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న‌ట్టు బండ్ల గ‌ణేష్ తెలిపారు.