40 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో కాంగ్రెస్‌లోకి హ‌రీశ్‌రావు..?

0
268

తెలంగాణ భారీ నీటిపారుద‌ల‌శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీశ్‌రావు టీఆర్ఎస్‌(తెలంగాణ రాష్ట్ర స‌మితి)లోని దాదాపు 40 మంది ఎమ్మెల్యేల‌తో కాంగ్రెస్‌లో చేర‌నున్నారు. అందుకు సంబంధించి డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నాడు అంటూ ఫేక్ న్యూస్‌ల‌ను పోస్టు చేస్తున్న జ‌న‌గామ‌కు చెందిన ప్ర‌శాంత్ అనే వ్య‌క్తిపై జ‌న‌గామ పోలీసుల‌కు ఫిర్యాదు అందింది.

అయితే, గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా ప‌లు సోష‌ల్ మీడియాలు సైతం హ‌రీశ్‌రావు కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ ప్ర‌చారం చేస్తూ క‌థ‌నాల‌ను ప్ర‌చురించ‌గా వాటిని హ‌రీశ్‌రావు ఖండించారు. అవ‌న్నీ కూడా అవాస్త‌వాల‌ని హ‌రీశ్‌రావు తేల్చేశారు. అయినా జ‌న‌గామ‌కు చెందిన‌ప్ర‌శాంత్ అనే వ్య‌క్తి హ‌రీశ్‌రావుపై అస‌త్య క‌థ‌నాల‌ను త‌న ఫేస్ బుక్ లో పోస్టు చేస్తుండ‌టంతో ఆ ప్రాంత డీసీపికి టీఆర్ఎస్‌వీ నాయ‌కులు ఫిర్యాదు చేశారు.