ఆ 32 సీట్లు వైసీపీ ఖాతాలోకి.. విశ్లేష‌కుల అంచ‌నా నిజ‌మ‌వుతుందా..?

0
221

ఈ ఏడాది ఏప్రిల్ 11న జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోప‌క్క వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేత‌లు ఎవ‌రికి వారు సొంత లెక్క‌లు వేసుకుంటూ గెలుపుపై ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ విశ్లేష‌కులు ప‌లు అంచ‌నాలు వేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తిర‌గతోడుతున్నారు. మే 23న వెల్ల‌డి కానున్న ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇలా ఉండ‌వ‌చ్చేమో.., అంటూ గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పోలుస్తున్నారు.

ఈ సంద‌ర్భంలోనే 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా మూడు జిల్లాల్లో మాత్రం టీడీపీ పెద్ద‌గా అసెంబ్లీ సీట్ల‌ను గెలుపొంద‌లేక‌పోయిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇలా అంచ‌నాలు వేస్తున్న వారు ఈ ద‌ఫా జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఆ మూడు జిల్లాల్లో గ‌తంలో వ‌చ్చిన సీట్లు మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

ఇంత‌కీ రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్న ఆ మూడు జిల్లాలు ప్ర‌కాశం, నెల్లూరు, క‌డ‌ప‌. ఇదిలా ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన స‌ర్వేల ప్ర‌కారం ఆ మూడు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశాయి. కేవ‌లం క‌డ‌ప‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లోనే మొత్తంగా 32 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అంటే 32 సీట్లు ప‌క్కాగా వైసీపీ ఖాతాలో ప‌డ‌టం ఖాయ‌మ‌ని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.