ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన 1200 మంది మ‌హిళ‌లు.. ఎందుకో తెలుసా..?

0
97

దేశ వ్యాప్త సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ హ‌క్కును వినియోగించుకునేందుకు ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు. అయితే, ఈ ద‌ఫా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఏపీలో ఓటింగ్ శాతం 80కు పైగా పెరిగే వ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో 78 శాతం ఓటింగ్ న‌మోదైన సంగ‌తి తెలిసిందే.

ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య రాజ‌మండ్రి క్వారీ ప్రాంత‌మైన సిద్ధార్థ‌న‌గ‌ర్‌లో వెయ్యి మందికిపైగా ఓట‌ర్లు ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించారు. అవ‌స‌ర‌మైతే నోటా బ‌ట‌న్ నొక్కుతామ‌ని చెబుతున్నారు. త‌మ ప్రాంతంలోని రోడ్లు, డ్రైనేజీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌మ‌ని ప్రజా ప్ర‌తినిధుల‌కు ఎన్నిసార్లు విన‌తిపత్రాలు అందించినా స్పంద‌న లేద‌న్నారు. త‌మ స‌మ‌స్యను అంద‌రికి తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతోనే దాదాప‌ను 1200 మంది మ‌హిళ‌లు ఎన్నిక‌ను బ‌హిష్క‌రించిన‌ట్టు సిద్ధార్థ‌న‌గ‌ర్ ప్రాంత వాసులు చెబుతున్నారు.