మూడు జిల్లాల్లో జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం..!

0
428

ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చినప్ప‌ట్నుంచి వ‌రుస ప్ర‌చారాల‌తో బిజీగా వున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మంగ‌ళ‌వారం నాడు ప్ర‌చారానికి విరామం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జ‌రుగుతున్న పార్టీ అభ్య‌ర్ధుల ప్ర‌చారాన్ని స‌మీక్షించేందుకు స‌మ‌యం కేటాయించారు.

ఇవాళ గుంటూరు, ప్ర‌కాశం, కృష్ణా జిల్లాల్లో జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం 9.30 గంట‌ల‌కు గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నుంచి జ‌గ‌న్ ప్ర‌చారం మొద‌ల‌వుతుంది. 11.30 గంట‌ల‌కు గుర‌జాల‌లో జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం జిల్లాకు చేరుకుని 1.30 గంట‌ల‌కు జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం ఉంటుంది. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు కృష్ణా జిల్లా మైల‌వ‌రం చేరుకుని ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొంటారు.