పోలీసు వ‌ర్సెస్ వైద్యుడు

0
99

ఎన్నిక‌ల వేళ న‌గ‌దు, మ‌ద్యం స‌ర‌ఫ‌రాను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ త‌నిఖీలు చేస్తున్నారు. రోడ్ల‌పై వాహ‌నాల‌ను చెక్ చేస్తున్నారు. అయితే, అంద‌రిలా త‌న వాహ‌నాన్ని ఆప‌మ‌న్నందుకు వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌కు చెందిన ఓ ఉన్న‌తాధికారి కోపం వ‌చ్చింది.  ఖ‌మ్మం జిల్లా క‌ల్లూరుప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన త‌నిఖీ కేంద్రం వ‌ద్ద పోలీసులు డీఎం హెచ్‌వో సీతారాములు వాహ‌నాన్ని ఆపారు.  దీంతో ఆ అధికారి రెచ్చిపోయాడు. నా కారునే ఆపుతావా అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్టు తిట్ల పురాణం అందుకున్నాడు.

నేనెవ‌రో తెలుసా..?  నా కారునే ఆపుతారా..?  మీకు అంత ద‌మ్ముందా..? అంటూ దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. పోలీసులు స‌ర్ది చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించినా విన‌లేదు. ద‌మ్ముంటే నా కారును సీజ్ చేయండి అంటూ రెచ్చిపోయాడు. ఓ కానిస్టేబుల్‌ను కూడా గాయ‌ప‌రిచాడు. రా తేల్చుకుందాం అంటూ స‌వాల్ కూడా విసిరాడు ఆ గ‌వ‌ర్న‌మెంట్ డాక్ట‌ర్‌.

కాసేపు ఓపిక ప‌ట్టిన పోలీసులు ఇక లాభం లేదు అనుకుని డీఎం హెచ్‌వో సీతారాముల‌పై కేసు న‌మోదు చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌ను అడ్డుకున్నందుకు సెక్ష‌న్ 350 కింద కేసు పెట్టారు.  ప్ర‌భుత్వ అధికారి అయి ఉండి వారికి స‌హ‌క‌రించాల్సింది పోయి నోరు పారేసుకుని కేసులో బుక్క‌య్యాడు ఈ ప్ర‌భుత్వ వైద్యుడు.