నేడు ఢిల్లీకి సీఎం చంద్ర‌బాబు

0
348

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈవీఎంల వైఫ‌ల్యంపై ఈ రోజు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చంద్ర‌బాబు ఫిర్యాదు చేయ‌నున్నారు. సీఈసీ సునీల్ అరోరాను క‌లిసి రాష్ట్రంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణలో లోపం జ‌రిగింద‌ని, అందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ల‌ను చంద్ర‌బాబు అందజేయ‌నున్నారు. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, క‌ళా వెంక‌ట్రావు, మ‌రికొంద‌రు ముఖ్య నేత‌లు ఈసీని క‌ల‌వ‌నున్నారు.

ఈసీపై పోరాడేందుకు దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల నేత‌లు ఇప్ప‌టికే చంద్ర‌బాబుతో ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తుంది. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా ప్ర‌వ‌ర్తిస్తుంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఎన్నికల క‌మిష‌న్, కేంద్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌పై ఉమ్మ‌డిగా పోరాడేందుకు చంద్ర‌బాబు కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకుంటున్న‌ట్టుగా తెలుస్తుంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌రైన రీతిలో స్పందించ‌క‌పోతే సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిష‌న్ వేస్తాన‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే తెలిపిన సంగ‌తి తెలిసిందే.