ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ క‌న్నుమూత‌..!

0
305

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కాసేప‌టి క్రితం తుది శ్వాస విడిచారు. కాగా, గ‌త కొంత కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విష‌యాన్ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు అధికారికంగా ధృవీక‌రించారు. షీలా దీక్షిత్ 1938 మార్చి 31వ తేదీన పంజాబ్ లోని కపుర్తలలో జ‌న్మించింది.

అత్య‌ధిక సంవ‌త్స‌రాలు ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విలో ఉన్న వారిలో షీలా దీక్షిత్‌ది మొద‌టి స్థానం. ఢిల్లీ ప్ర‌జ‌లు ఆమెను ఏకంగా మూడుసార్లు (15 సంవ‌త్స‌రాలు) ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నారు. ఆమె ప్ర‌స్తుతం ఢిల్లీ కాంగ్రెస్ అధ్య‌క్షులుగా ఉన్నారు. ఆమెకు కుమారుడు సందీప్ దీక్షిత్, కూతురు లతిక దీక్షిత్ సయ్యద్ ఉన్నారు.