జ‌నసేన స‌భ‌లు ర‌ద్దు..!

0
100

వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. జిల్లాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న ఆయ‌న‌కు వ‌డ‌దెబ్బ త‌గిలింది. విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకుని గుంటూరు జిల్లాలో ప్ర‌చార స‌భ‌ల‌కు వెళ్లేందుకు హెలికాప్ట‌ర్‌లో విజ‌య‌వాడ‌కు చేరుకున్న ప‌వ‌న్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న్ను ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు కొంత విశ్రాంతి తీసుకోవాల‌ని ప‌వ‌న్‌కు సూచించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం జ‌న‌సేన శ్రేణుల‌ను కొంత క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది.

అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుక్ర‌వారం విజ‌య‌న‌గ‌రం ప‌రిధిలోగ‌ల అయోధ్య మైదానంలో జ‌రిగిన ప్ర‌చార స‌భ‌లో అభిమానులు, కార్య‌క‌ర్త‌న‌లు ఉద్దేశించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతుండగా ఓ వ్య‌క్తి అత్యుత్సాహాన్ని ప్ర‌దర్శించాడు. ప‌వ‌న్ ప్ర‌సంగిస్తుండ‌గా స్టేజ్ వెనుక‌భాగం నుంచి వ‌చ్చిన స‌ద‌రు వ్య‌క్తి ఆయ‌న కాళ్ల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. రెండు కాళ్లు ప‌ట్టుకోవ‌డంతో ప‌ట్టు కోల్పోయిన ప‌వ‌న్ ఒక్క‌సారిగా కింద ప‌డిపోయారు. అయితే, తాజాగా జ‌రిగిన ఈ హ‌ఠాత్ప‌రిణామంతో అంతా షాక్ తిన్నారు. మ‌రో వైపు ఇవాళ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప‌వ‌న్ ర‌ద్దు చేసుకున్నారు. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల విరామం ఇచ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Read Also: లక్ష్మీపార్వతి నన్ను లైంగికంగా వేదిస్తుంది : అనుచరుడు కోటి ఫిర్యాదు..!