కోలీవుడ్ హీరోయిన్ గాసినిమాల్లో సరైన అవకాశాలు లేక ఆత్మహత్య

0
123

సినిమా అనే రంగుల ప్రపంచం ఎంత మందికి జీవితాన్ని ఇచ్చిందో.. అంతమందిని పొట్టన పెట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇక్కడ అవకాశం వచ్చి అదృష్ట్రం ఉంటే స్టార్.. లేదంటే బెకార్.. వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు.. పైగా నువ్వేం సినిమాలు చేస్తావ్.. సినిమాలకు నువ్వు పనికిరావ్ అంటూ ఎలనా చేస్తారు.. అది తట్టుకోలేకే ఇప్పటివరకు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఇలాంటి ఘటనే ఇప్పుడు మరొకటి జరిగింది. కోలీవుడ్ వర్థమాన నటి రియామిక్కా (26) ఆత్మహత్య చేసుకోవడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. తమిళనాడులోని వలసరవాక్కమ్ లో ఉన్నతన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈమె జీవితకథ వింటే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టాల్సిందే.. ఎన్నో కళలు కానీ స్టార్ హీరోయిన్ అవ్వాలని పరిశ్రలో అడుగుపెట్టింది.. కానీ సరైన అవకాశాలు రాలేదు.. పరిస్థితులు బాగాలేవు.. దాంతో ఎవడో చెప్పిన మాటలు విని డబ్బుకోసం  పొరపాటున తొందరపడి ఓ అశ్లీల చిత్రంలో నటించింది… అంతే వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ అవమానలే.. నువ్వు ఇక స్టార్ హీరోయిన్ అవ్వలేను అను స్నేహితులు ఛీ కొట్టడం ఒకటైతే.. ప్రియుడి వేధింపులు మరోవైపు.. ఈ రెండు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని తెలుస్తుంది… రియామిక్కా ‘కుంద్రాతిలే కుమారానుకు కొండట్టం’, ‘అఘోరి యిన్ అట్టమ్ ఆరంభం’ ‘ఎక్స్ మీడియా’ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయినా కూడా ఆమెకు సరైన అవకాశాలు రావడంలేదు. తన కుటుంబం తన సంపాదన మీదే ఆధారపడి వుంది. దీంతో ఆమె సంపాదన కోసం బ్లూఫిల్మ్ లో నటించింది. అప్పటినుంచి ఆమె స్నేహితురాళ్ళు ఆమెను అవహేళన చేయసాగారు.  నువ్వు అశ్లీల చిత్రంలో నటించావు కాబట్టి నీకు హీరోయిన్ గా అవకాశాలు రావని అన్నారు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది రియా.

తన సోదరుడు ప్రకాష్ తో కలిసి వలసరవాక్కమ్ లోని అద్దె ఇంట్లో గత నాలుగు నెలలుగా నివాసం ఉంటున్నారు రియా. అక్కడే జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్న దినేష్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. బ్లూఫిల్మ్ తరువాత అతని నుంచి కూడా వేధింపులు ఎక్కువయ్యాయని.. దాంతో రియా తీవ్ర ఆందోళనకు గురైందని తెలుస్తోంది. ఇక పోలీసులు చెబుతున్నా సమాచారం ప్రకారం..  రియాకు చివరగా ఆమె బాయ్ఫ్రెండ్ దినేష్ లేట్ నైట్ ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికి వెళ్లి ఆమె సోదరుడు ప్రకాష్ ను అడిగాడు. దాంతో ఇద్దరు కలిసి ఆమె బెడ్ రూమ్ డోర్ కొట్టగా ఎంతకీ డోర్ తీయక పోవడంతో కిటీకి ఓపెన్ చేసి చూడగా రియా ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. ఇక ఆమె గదిలో మాత్రం ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సినిమాల్లో సరైన అవకాశాలు లేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు.. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.